31 August, 2026 | 10:20 PM

Breaking News

శ్రీరంగాపూర్‌లో శాస్త్రవేత్తల క్షేత్ర సందర్శన   •   బిజెపి మహా దీక్షను విజయవంతం చేయాలి   •   కొమరం భీమ్ నగర్ గ్రామంలో త్రాగునీటి సమస్య కు పరిష్కారం చూపండి   •   ప్రజల సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్యం   •   ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే జాగో తెలంగాణ యాత్ర   •   ఆదివాసి బిడ్డ శిరీషపై అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను శిక్షించాలి   •   సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి   •   పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి   •   బిజెపి నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి   •   మహబూబ్‌నగర్–డోన్ రైల్వే డబుల్ లైన్‌కు భూసేకరణ త్వరలో పూర్తి   •  

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే... హైకోర్టు తీర్పుపై కిషన్ రెడ్డి స్పందన

22-04-2026 02:59 PM

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఆధారాలు సమర్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) విఫలమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై(Kaleshwaram Commission) తెలంగాణ హైకోర్టు తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు, స్మితా సబర్వాల్, ఎస్ కే జోషీలకు ఊరట లభించింది. కోర్టు తీర్పుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై సరైన విచారణ జరగలేదని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే అని కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు.