కాళేశ్వరంపై కేంద్రం సీబీఐ విచారణ చేయించాలి.. కాంగ్రెస్ ఎంపీ చామల డిమాండ్
- బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు?
- హైకోర్టు కోర్టు తీర్పులో ఏముంది?
- కాళేశ్వరం అంశంలో క్లీన్ చిట్ పై హరీశ్ ఢిల్లీలో ఏమైనా మంతనాలు చేశారా?
- తీర్పు కాపీ చూశాక.. తదుపరి కార్యాచరణపై నిర్ణయం
- ఎన్డీఎస్ఏ నివేదిక తప్పో.. లేదో బీజేపీ చెప్పాలి
హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై(Kaleshwaram Lift Irrigation Project) జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టలేదని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు?, బీఆర్ఎస్ సంబరాలు చేసుకునేలా కోర్టు తీర్పులో ఏముంది? అని చామల ప్రశ్నించారు. తీర్పు కాపీ చూశాక.. తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అధికారులు, బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) నిర్లక్ష్యం వల్లే మేడిగడ్డ కుంగిపోయిందని ఆరోపించారు. నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పిల్లర్లు కుంగినట్లు ఎన్డీఎస్ఏ చెప్పిందని వివరించారు.
ఎన్డీఎస్ఏ నివేదిక తప్పో.. లేదో బీజేపీ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ(Congress MP) డిమాండ్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా బీజేపీ సీబీఐ విచారణ చేయాలని కోరలేదన్నారు. కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం(Central Government) సీబీఐ విచారణ చేయించాలని చామల కిరణ్ డిమాండ్ చేశారు. ఘోష్ నివేదికపై తదుపరి కార్యాచరణను సాయంత్రంలోపల నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం అంశంలో క్లీన్ చిట్ కోసం హరీశ్ రావు(Harish Rao) ఢిల్లీలో ఏమైనా మంతనాలు చేశారా? అని ఆయన ప్రశ్నించారు.






