కేంద్ర మంత్రుల పనితీరులో కిషన్‌రెడ్డి నంబర్‌వన్
- ర్యాంక్ సాధించడం పట్ల బీజేపీ నేతల హర్షం
- అభినందనలు తెలిపిన ఓబీసీ మోర్చా నేషనల్ మెంబర్ పెరిక సురేష్
హైదరాబాద్, మే 30(విజయక్రాంతి): కేంద్ర మంత్రుల పనితీరు గ్రేడింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి నం బర్ వన్ ర్యాంక్ సాధించడం పట్ల బీజేపీ ఓ బీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డిని పెరిక సురేష్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో మర్యాదపూర్వకంగా కలిసి అభినంద నలు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ మంత్రివర్గంలోని కేంద్ర మంత్రుల పనితీరు అంచనాల్లో కిషన్ రెడ్డి గ్రేడింగ్‌లో నంబర్-వన్ స్థా నం సాధించడం ఆయన పరిపాలనా నైపు ణ్యం, అభివృద్ధిపట్ల అంకితభావానికి నిదర్శనమన్నారు.
దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని మోదీ చేపట్టిన ‘వికసిత్ భారత్’ సంకల్ప సాధనలో కిషన్ రెడ్డి సమర్థవంతంగా పనిచేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నారని నాయ కులు కొనియాడారు. తెలంగాణ గర్వించదగ్గ నాయకుడిగా, బీజేపీకి అంకితభావంతో సేవలందిస్తున్న నేతగా కిషన్ రెడ్డి పేరు దేశవ్యా ప్తంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ , బీజేపీ రాష్ట్ర మీడియా విభాగం చీఫ్ ఎన్‌వీ సుభాష్ తదితరులు పాల్గొని కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.






