12 March, 2026 | 5:51 AM

దీప్తి శర్మ, రిచా ఘోష్‌పై కాసుల వర్షం

12-03-2026 12:07 AM

ది హండ్రెడ్ క్రికెట్ లీగ్ వేలం 

లండన్, మార్చి 11 : ఇంగ్లండ్ వేదికగా జరిగే ది హండ్రెడ్ క్రికెట్ లీగ్‌లో తొలిసారి వేలం జరుగుతోంది. 2026 సీజన్ కోసం మహిళల వేలం లో మొత్తం 8 ఫ్రాంచైజీలు 178 మంది ప్లేయర్ల కోసం పోటీపడ్డాయి. ఈ వేలంలో భారత మహి ళా క్రికెటర్లు దీప్తి శర్మ, రిచా ఘోష్‌పై కనకవర్షం కురిసింది. రిచాను మాంచెస్టర్ సూపర్ జెయిం ట్స్ రూ. 61.73 లక్షలకు దక్కించుకోగా.. స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మను సన్‌రైజర్స్ లీడ్స్ రూ. 33.96 లక్షలకు సొంతం చేసుకుంది.

మరికొంతమంది భారత క్రికెటర్లు ఆరంభ రౌండ్లలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. యస్తికా భాటియా, శ్రీచరణిపై ఏ ఫ్రాంచై జీ ఆసక్తి చూపలేదు. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాల్గొనలేదు. స్టార్ ప్లేయర్లు స్మృతి మంధన, జెమీమా రోడ్రిగ్స్‌ను వేర్వేరు ఫ్రాంచైజీలు ప్రీ సైనింగ్ చేసుకున్నాయి. కాగా గురువా రం పురుషుల విభాగంలో వేలం జరుగనుంది. 2021లో ప్రారంభమైన ది హండ్రెడ్ లీగ్ లో ఎలాంటి ఓవర్లు ఉండవు బౌలర్లంతా కలిసి 100 బంతులు వేయాలి. ఒక్కో బౌలర్ అత్యధికంగా 20 బంతులు మాత్రమే వేయాల్సి ఉంటుంది.   ఒక బౌలర్ ఐదు లేదా వరుసగా పది బంతులను కూడా ఒకే సారి వేయొచ్చు.