కనకరాజా.. కమ్సాహంనిదా!
వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. భారతీయ, కొరియన్ నేపథ్యాల్లో హారర్, కామెడీ, క్రాస్ కల్చర్ మేళవింపుతో పుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి చిత్రబృందం తాజాగా తొలి గీతం ‘కమ్సాహంనిదా’ను విడుదల చేసింది.
తమన్ సంగీతం అందించిన ఈ పాట రితికా నాయక్ సరదాగా ‘కమ్సాహంనిదా’ అని పలకడంతో ప్రారంభమవుతుంది. దానికి అర్థం ఏమిటని వరుణ్ తేజ్ ఆసక్తిగా అడుగుతాడు. కొరియన్ భాషలో ‘ధన్యవాదాలు’ అనే సమాధానం చెప్పడం, వారి మధ్య ఉన్న ప్రేమకు చక్కటి నాంది పలుకుతుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్; డీవోపీ: మనోజ్‌రెడ్డి కాటసాని.




