12 April, 2026 | 5:42 AM

మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచేందుకు కృషి

19-02-2026 02:17 AM

ఖేడ్ మున్సిపల్ చైర్మన్ నగేష్ శేట్కార్ 

నారాయణఖేడ్, ఫిబ్రవరి 18: నారాయణఖేడ్ మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని నారాయణఖేడ్ నూతన మున్సిపల్ చైర్మన్ నగేష్ ష ట్కార్ బుధవారం అన్నారు. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇ బ్బంది లేకుండా కార్మికులు చూడాలని అన్నారు. కార్మికులకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కార్మికులు నూతన చైర్మన్ కు కౌన్సిలర్లకు సన్మానించారు. కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్ శేట్కార్, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మున్సిపల్ శానిటైజర్ శ్రీనివాస్ కార్మి కులు చంద్రకళ, శకుంతల ,సుశీల, రాజు యేసు, సిద్ధమ్మ మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.