12 April, 2026 | 7:19 AM

ఓయూ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌గా మాదగాని మహేష్ గౌడ్

19-02-2026 02:17 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ నూతన ఇన్స్పెక్టర్‌గా మాదగాని మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. మహేష్ గౌడ్ గతంలో నాచారం, మంగళ్ హాట్ పోలీ  స్టేషన్ లో పనిచేశారు. మంగళ్ హాట్ లో ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహించి, అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్‌కి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు తనవంతు కృషి చేస్తానన్నారు.ఎప్పటి కప్పుడు నిఘా పెంచుతూ ముఖ్యంగా అసాంఘీయ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా పలువురు స్టేషన్ సిబ్బంది ఇన్స్పెక్టర్‌కి పుష్పగుచ్చాన్ని అం దించి శుభాకాంక్షలు తెలిపారు.