5 April, 2026 | 5:29 AM

ఖానాపూర్ ఎన్నిక వాయిదా

05-04-2026 12:50 AM
  1. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక గందరగోళం 
  2. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన 
  3. ఒక సభ్యుడి ఓటుపై వివాదం 
  4. కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు 
  5. పార్టీల తీరుపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆగ్రహం 

నిర్మల్ (ఖానాపూర్), ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తీవ్ర గందరగోళం మధ్య మూడోసారీ వాయిదా పడింది. కోర్టు ఆదేశాల మేరకు శనివారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి జీవరత్నం, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నిక నిర్వ హించారు.

దీనికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నలుగురు కాంగ్రెస్ సభ్యులతో హాజరుకాగా బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి గెలిచిన నలుగురు చొప్పున సభ్యులు హాజరయ్యారు. వీరి చేత ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. మొదట బీజే పీ, బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా మౌనిక మహేందర్ పేరు ను ఓ సభ్యుడు ప్రతిపాదించగా అందరూ చేతులు ఎత్తినట్లు తెలిసింది. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి చిన్న సత్యం పేరు చెప్పినప్పుడు కూడా సభ్యులు మళ్లీ చేతులు లేపినట్టు తెలిసింది.

ఒక్క అభ్యర్థికి మాత్రమే మద్దతు ఇవ్వా లని అధికారులు చెప్పటంతో మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత మౌనికను చైర్మన్ అభ్యర్థిగా ప్రతిపాదిం చగా ఆమెకు ఏడుగురు సభ్యులు మద్దతు తెలిపారు. తర్వాత చిన్న సత్యం పేరు ప్రతిపాదించగా ఆయన ఎమ్మె ల్యే ఓటుతో కలిసి ఏడుగురు మద్దతు లభించింది. దీంతో చైర్మన్ అతడే అంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టుబట్టారు.

అయితే మొదటగా ఏడుగురు సభ్యులు తమకు మద్దతు తెలిపినా అధికారులు మళ్లీ ఓటింగ్ నిర్వహించడం అధికార పార్టీకి మద్దతు పలకడమేనని బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎన్నిక వీడియో పరిశీలించిన అధికారులు.. ఓ అభ్యర్థి ఇద్దరికి మద్దతు ఇస్తూ చేయి లేపినట్టు అందులో ఉందని, విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని పట్టుబట్టారు. వీడియోలో వాస్తవం లేదని ప్రతిపక్ష నాయకులు మున్సిపల్ కార్యాలయంలోకి దూసుకెళ్లారు. 

బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల ఆందోళన 

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అధికారులతో కుట్రపన్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్నికను వాయిదా వేశారంటూ బిజెపి, బీఆర్‌ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, బిఆర్‌ఎస్ నియోజకవర్గ జాన్సన్ నాయక్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పెద్ద ఎత్తు న ప్రయత్నించారు. ఈ విషయాన్ని పసిగట్టిన అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

పోలీసులు ఆందోళన కారులను అడ్డుకుని చెదరగొట్టారు. పోలీసులకు, కాంగ్రెస్ పార్టీకి, బొజ్జు పటేల్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్, బీజేపీ నేత లు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సుమారు రెండు గంట లు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన ఎన్నిక ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా అడ్డదారిలో చైర్మన్ పదవి పొందేందుకు ప్రయ త్నాలు సాగించారని దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

అనంతరం నిర్మల్ కలెక్టర్ కార్యాలయానికి ఇరు పార్టీల కౌన్సిలర్లతో కలిసి వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఖానాపూర్‌లో ఉదయం 11 గం టల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాజకీయ ఐ డ్రామా కొనసాగడంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను తెప్పించి శాంతి భద్రతల పరిషరక్షణ చేశారు.

ప్రజాస్వామ్యం తనకు ఎంతో గౌరవం అని, కావాలనే బీజేపీ, బీఆర్‌ఎస్ తనపై అసత్యపు ఆరోపణలు చేసి రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ధ్వజమెత్తారు. ఖానాపూర్‌లో ఎన్ని కుట్రలు పన్నినా చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ప్రకటించారు.