ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్
31-07-2026 08:04 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): ముస్లిం హక్కుల పోరాట సమితి కొత్తగూడెం కార్పొరేషన్ అధ్యక్షుడిగా, ఎండీ ఖాజా భక్ష్ నియమితులయ్యారు. శుక్రవారం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖలీల్ అహ్మద్ నియామక పత్రం అందించారు. ఈ సందర్భంగా ఖాజా భక్ష్ మాట్లాడుతూ... తన మీద నమ్మకంతో కొత్తగూడెం కార్పొరేషన్ బాధ్యతలు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ముస్లిం హక్కుల కోసం పనిచేస్తానని తెలిపారు. తనకు అవకాశం ఇచ్చిన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండీ ఫయాజుద్దీన్, రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రియాజ్, జిల్లా అధ్యక్షుడు ఎండీ ఖలీల్, జిల్లా బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.






