అంబేద్కర్ దూరవిద్యా దరఖాస్తులకు గడువు పొడగింపు
31-07-2026 08:52 PM
సీఆర్పీఎఫ్ డీఐజీపీ డాక్టర్ బి వీర్రాజు
జవహర్ నగర్,(విజయక్రాంతి): సిఆర్పీఎఫ్ క్యాంపస్ అంబేద్కర్ దూరవిద్యా కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీఆర్పీఎఫ్ డీఐజీపీ డాక్టర్ బి వీర్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఇంటర్ మధ్యలో చదువును ఆపేసిన వారికి సువర్ణావకాశమని, దూరవిద్య ద్వారా చదువును కొనసాగించవచ్చని తెలిపారు. బీఏ, బీకామ్ కోర్సులు ఏర్పాటు చేశామన్నారు. మరింత సమాచారం కోసం స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ హరిశంకర్ను సంప్రదించాలన్నారు. 7 ఆగస్టు 2026లోగా దరఖాస్తులను సమర్పించాలని తెలిపారు.






