31 July, 2026 | 10:10 PM

మొదటి త్రైమాసికంలో జేఎల్ఆర్ ఇండియా రికార్డు స్థాయి అమ్మకాలు

31-07-2026 09:07 PM

ముంబై, ఇండియా –: 

కార్ల అమ్మకాల్లో జేఎల్ఆర్ ఇండియా సంచలన రికార్డులు నమోదు చేస్తూనే ఉంది. తాజాగా రికార్డు స్థాయిలో అత్యంత బలమైన మొదటి త్రైమాసిక రిటైల్ అమ్మకాల పనితీరును నమోదు చేసింది.

ఆర్ధిక సంవత్సరం27 మొదటి త్రైమాసికంలో 1,665 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే (YoY) 11% అధికం. ఈ త్రైమాసికంలో హోల్‌సేల్ అమ్మకాలు 1,694 యూనిట్లుగా నమోదయ్యాయి, ఇది గతేడాదితో పోలిస్తే 4% అధికం.  ఆర్ధిక సంవత్సరం27 మొదటి త్రైమాసికంలో మొత్తం రిటైల్ అమ్మకాలలో 85% పైగా రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు డిఫెండర్ మోడళ్లే ఉన్నాయి. ఇది భారతదేశ లగ్జరీ ఎస్ యువి విభాగంలో వాటి బలాన్ని స్పష్టం చేస్తుంది. డిఫెండర్ కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది, ఇది భారతదేశంలో దాని 'టఫ్ లగ్జరీ' ప్రతిపాదనకు కొనసాగుతున్న ఆదరణను తెలియజేస్తుంది.

 ఇక ఈ త్రైమాసికంలో, జేఎల్ఆర్ ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కింద రేంజ్ రోవర్ ఎస్.వి మరియు రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్.వి మోడళ్లకు సవరించిన ధరలను ప్రవేశపెట్టింది. మోడల్‌ను బట్టి ₹ 75 లక్షల వరకు ప్రయోజనాలు లభించాయి. ఈ ప్రకటన వినియోగదారుల్లో ఆసక్తికి పెంచింది. ముఖ్యంగా ఎస్.వికు సంబందించి అన్ని విషయాలు తెలుసుకునేందుకు గణనీయంగా విచారణలు పెరిగాయి. రెండు మోడళ్లలోనూ బెస్‌పోక్ కమిషన్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ సందర్భంగా జెఎల్‌ఆర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజన్ అంబా గారు మాట్లాడుతూ: “మా అత్యుత్తమ క్యూ1 రిటైల్ పనితీరుతో మేము FY27ను బలంగా ప్రారంభించాం. రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ మరియు డిఫెండర్‌లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.

ఇండియా-యూకే ఎఫ్‌టిఏ తర్వాత SV మరియు బెస్‌పోక్‌లపై ఆసక్తి పెరగడాన్ని మేము గమనిస్తున్నాము. భారతదేశంలో లగ్జరీ ఆటోమోటివ్‌కు ఇది ఒక కీలకమైన ఘట్టంగా మేము ఎఫ్‌టిఏను స్వాగతిస్తున్నాము. ఇది మా వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా, మేము ఎంపిక చేసిన మరిన్ని ఎస్.వి ఉత్పత్తులను, ప్రత్యేకమైన రేంజ్ రోవర్ స్పెషల్ ఎడిషన్‌లను మరియు బెస్‌పోక్ క్రియేషన్‌లను వారికి అందించడానికి వీలు కల్పిస్తుంది. ముందున్న బలమైన ప్రొడక్ట్ పైప్‌లైన్‌తో, FY27లో ఈ జోరుని కొనసాగించడానికి మేము మంచి స్థితిలో ఉన్నామన్నారు.