31 July, 2026 | 9:25 PM

పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు

31-07-2026 08:02 PM

దమ్మపేట,(విజయ క్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల సత్తపల్లి మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎంఎల్ఏ, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

శుక్రవారం నర్సంపేట నియోజకవర్గంలో జరిగిన అంతిమ యాత్రలో  పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి పోషించిన కీలక పాత్రను, నియోజకవర్గ ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు  గుర్తుచేసుకున్నారు. సుదర్శన్ రెడ్డి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వారు ప్రార్థించారు.