28 August, 2026 | 3:12 AM

ప్రధాని రేసులో సీఎం విజయ్!

28-08-2026 01:47 AM

మొదిటి స్థానంలో ప్రధాని మోదీ 

రెండో స్థానంలో రాహుల్‌గాంధీ,

మూడో స్థానంలో తమిళనాడు సీఎం విజయ్ 

మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కీలక విషయాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 27: తమిళనాడులో రెండేళ్ల క్రితం టీవీకే పార్టీని స్థాపించి, అనతికాలంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ఈ ఏడాది సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జోసఫ్ విజయ్ జాతీయ స్థాయిలోనూ అంతే వేగంగా పాపులారిటీ పెంచుకుంటున్నారు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో ఈ విషయం నిర్ధారణ అయింది.

తాజా సర్వేలో విజయ్ ప్రధాని రేసులో దేశంలో కీలకమైన నేతల్ని వెనక్కి నెట్టి ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. అయితే మొదిటి స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ, రెండో స్థానంలో ఎంపీ రాహుల్‌గాంధీ ఉన్నారని సర్వే స్పష్టం చేసింది. 2029లో జరిగే ఎన్నికల్లో దేశంలో ప్రధానిగా ఎవరు ఉంటే బాగుంటుందనే అంశంపై ఈ సర్వేలో అడిగిన ప్రశ్నకు టీవీకీ అధినేత విజయ్‌కి 9.2 శాతం మంది మద్దతు ఇచ్చారు. ఈ జాబితాలో 48.7 శాతం మద్దతుతో ప్రధాని నరేంద్ర మోదీ, 27.1 శాతం మద్దతుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన కంటే ముందున్నారు.

ప్రధాని అభ్యర్థుల జాబితాలో విజయ్.. మమతా బెనర్జీ (2 శాతం ఓట్లు), అఖిలేష్ యాదవ్ (1.7 శాతం ఓట్లు), అభిజీత్ దిప్కే (1.3 శాతం ఓట్లు), అరవింద్ కేజ్రివాల్ (1.2 శాతం ఓట్లు) కంటే ఎంతో ముందున్నారు. ఈ సర్వేలో విజయ్ కేవలం తదుపరి ప్రధానమంత్రి ఎవరనే ప్రశ్నకు మాత్రమే పరిమితం కాలేదు, ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించడానికి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులలో ఎవరు అత్యంత అనుకూలమైనవారు అని అడిగితే విజయ్ 12.2 శాతం ఓట్లతో మరోసారి అగ్రస్థానానికి సమీపంలో నిలిచారు. 29 శాతం ఓట్లతో అగ్రస్థానంలో ఉన్న రాహుల్ గాంధీ తర్వాతి స్థానంలో ఉన్నారు.