9 August, 2026 | 4:07 AM

పెద్ది కుటుంబానికి పెద్దదిక్కుగా కేసీఆర్

09-08-2026 12:40 AM
  1. సుదర్శన్‌రెడ్డి ఫ్యామిలీకి బీఆర్‌ఎస్ తరఫున రూ.2.25 కోట్లు అందజేత 
  2. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా నేతలతో చర్చించిన కేసీఆర్ 
  3. నేడు నర్సంపేటకు కేసీఆర్

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఇటీవల అనారోగ్యంతో మరణించిన తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా నిలవాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా, సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో కోటి రూపాయ ల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో, పెద్ది సుద ర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున వారి బాగోగుల కోసం మరో రూ.25 లక్షలు ఆమె పేరు మీద బ్యాంకులో జమ చేయనున్నారు. తద్వారా మొత్తంగా రూ.2.25 కోట్లను పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అండ గా నిలవాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది.

ఇంతటితోనే కాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పార్టీ సీనియర్లతోపా టు వరంగల్ జిల్లా పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ము ఖ్యులు కూర్చొని, వారి కుటుంబానికి సంక్షే మ కార్యక్రమాలకు సంబంధించిన నిర్ణయా లు తీసుకుంటారని, ఎల్లకాలం వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

నేడు నర్సంపేటకు కేసీఆర్

పార్టీ స్థాపించిన నాటి నుంచి ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ, పార్టీ కోసం కృషిచేస్తూ, తన ముఖ్య అనుచరుడుగా కొనసాగిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణంతో విషాదంలో ఉన్న అధినేత కేసీఆర్, తన ఆప్తుని కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఈ మేరకు ఆదివారం నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి వెళ్లనున్నారు.  ఇంటి పెద్దను కోల్పోయి శోక తప్త హృదయులై వున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి కష్టకాలంలో ఉన్న వారికి  భరోసా ఇవ్వనున్నారు. నర్సంపేట నియోజకవర్గం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు కేసీఆర్ గుండె ధైర్యం నింపనున్నారు.