28 May, 2026 | 4:33 AM

తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష

28-05-2026 12:55 AM
  1. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం
  2. గజ్వేల్ మార్కెట్ కమిటీ ముందు బీఆర్‌ఎస్ ధర్నా, వంటావార్పు 
  3. భారీ సంఖ్యలో పాల్గొన్న బీఆర్‌ఎస్ శ్రేణులు 
  4. వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆర్డీవోకు వినతి పత్రం అందజేత

గజ్వేల్, మే 27: తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే శ్రీరామరక్ష అని,  కెసిఆర్ హయాంలోనే ప్రజలు రైతులు ఎలాంటి కష్టాలు లేకుండా జీవనం కొనసాగించారని గజ్వేల్ నియోజకవర్గం బిఆర్‌ఎస్ ఇన్చార్జి వంటేరు ప్రతాప రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మార్కెట్ యార్డు ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష, వంటావార్పు నిర్వహించారు. వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన ఈ దీక్షలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి రైతు సంక్షేమం వరకు కేసీఆర్ ఎన్నో ఉద్యమాలు చేశారని, కరువుతో కొట్టుమిట్టాడిన తెలంగాణను ప్రాజెక్టులతో సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్దేనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కూడా కేసీఆ్ప విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. వంద లారీలు కూడా ధాన్యం పండని తెలంగాణలో కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టుల వల్లే వేల లారీల ధాన్యపు రాశులు పండిస్తున్నారన్నారు. 

గజ్వేల్లో ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం 30 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేసిందని, ఇంకా 70 శాతం వడ్లు కల్లాల్లోనే ఉన్నాయని ఆరోపించారు. రైతులు కుటుంబాల తో కలిసి మార్కెట్ యార్డుల వద్ద పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు కష్టాలకు కారణమైన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారని వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయాంలో వర్గల్లో రైస్ మిల్లుల కోసం భూసేకరణ చేపట్టగా కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని విమ ర్శించారు.

రైతు సంక్షేమానికి కేసీఆర్నే భరో సా అని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. గజ్వేల్ మార్కెట్ యార్డ్ వద్ద ధర్నా అనంతరం భోజనాలు చేసి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్ పర్సన్ పద్మాబాయి నర్సింగరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమి టీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, రైతుబంధు రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు  దేవి రవీందర్, డిసిసిబి డైరెక్టర్ అంజిరెడ్డి, నాయకులు జూబేర్ భాష, జేజేల వెంకటేశం గౌడ్, ఇంద్రసేనారెడ్డి, నవాజ్ మీరా, బెండ మధు, కౌన్సిలర్లు సర్పంచులు మాజీ సర్పంచ్లు నాయకులు,  రైతులు పాల్గొన్నారు.