28 April, 2026 | 3:03 AM

కేసీఆరే తెలంగాణకు శ్రీ రామరక్ష

28-04-2026 12:12 AM

జెండాను ఆవిష్కరించిన బీఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, టీఎస్పీసీఎల్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేష్

ఘనంగా బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సికింద్రాబాద్, ఏప్రిల్27 (విజయక్రాంతి): కేసీఆరే తెలంగాణకు శ్రీ రామరక్ష అని గజ్జల నగేష్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం లో వార్డ్ 7 పార్టీ కార్యాలయంలో బిఆర్‌ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, టీఎస్పీసీఎల్  మాజీ చైర్మన్ గజ్జెలనాగేష్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గజ్జల నగేష్ మాట్లాడుతూ.. పార్టీ స్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చూపిన దూరదృష్టి, నాయకత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు.

రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, వార్డ్ 2 అధ్యక్షులు కుమార్ ముదిరాజ్,మాజీ మార్కెట్ సభ్యుడు దేవులపల్లి శ్రీనివాస్, రావుల సతీష్,పనస సంతోష్,మురళియాదవ్, శేఖర్, నిత్య, నవీన్, గణేష్, అనిల్, సంతోష్ గౌడ్, విజయ లక్ష్మి, నీస్సీ, శిరీష , స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఓల్డ్ బోయిన్‌పల్లిలో పరిధిలో 

సికింద్రాబాద్: బీఆర్‌ఎస్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఓల్డ్‌బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నర సింహ యాదవ్ అన్నారు. ఓల్డ్‌బోయిన్ పల్లి బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 26 వఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు ముఖ్య కార్యకర్తలు మహిళా సోదరి మణులతో కలిసి మాజీ కార్పొరేటర్ ముద్దం నర సింహ యాదవ్  జెండా ఆవిష్కరించారు.

కార్యక్రమంలో డివిజన్ సెక్రటరీ హరినాథ్, సీనియర్ నాయకులు కర్రె జంగయ్య, నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇజాజ్, మహిళా అధ్యక్షురాలు లలితగౌడ్, గడ్డం నర్సింగ్‌రావు, పోచయ్య, యాదగిరి ఖదీర్, సర్వర్, సంతోషి, దుర్గ, రోజా, సునంద, కమ ల, దేవి, పద్మ, కవిత, ఐలేష్ , పిట్ల రాజు, మట్టి శ్రీనివాస్, రాజుగౌడ్, వెంకటేష్, కృష్ణారెడ్డి, సంపత్, స్వామి, రాజేష్, సుందర్, సాయిల్, శ్రీనివాస్ రెడ్డి, చందు యాదవ్, ఉదయ్, మక్కలసత్యనారాయణ, గణేష్ పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

నాగోల్: భారత రాష్ట్ర సమితి (భారస) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని లింగోజిగూడా డివిజన్లోని లిబర్టీ చౌరస్తా వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లా లని, భవిష్యత్తులో పార్టీ మరింత బలోపేతం కావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి నాయకుడి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, తిలక్ రావు, రాజశేఖర్ రెడ్డి, ఆడాల రమేష్, దయానంద్, రాకేష్ ఠాగూర్, జగన్నాథ్ రెడ్డి, నర్సింహా గుప్తా, భాస్కర్ గంగపుత్ర, ఇంద్రాజీ, ఆశిష్, నాగేశ్వరరావు, శ్రీధర్, ప్రకాష్, శ్రీకాం త్, చిత్రం సాయి, షఫీ, వెంకట్ రెడ్డి, రాజేందర్, ప్రసాద్, యశ్వంత్, రుద్ర శ్రీను, అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అలాగే నాగోల్ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డివిజన్ అధ్యక్షులు తూర్పాటి చిరంజీవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు చెరుకు ప్రశాంత్ గౌడ్, అనంతుల రాజారెడ్డి, పీఎంఆర్ రాజు  పాల్గొన్నారు.

ముషీరాబాద్ పరిధిలో..

ముషీరాబాద్: బీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని పార్టీ యువ నాయకుడు ముఠా జైసింహ పేర్కొన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకొని ముషీరాబాద్ దాయార మార్కెట్ వద్ద పార్టీ సీనియర్ నాయకుడు రాజా దీన్ దయాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ముఠా జైసింహ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సోమన్, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, పార్టీ నాయకులు శ్రీనివాస్, జావిద్ ఖాన్, వంగాల నర్సింగ్‌రావు, ఆబేద్ తదితరులు పాల్గొన్నారు. బాపూజీనగర్‌లోని వైఎస్‌ఆర్ పార్కు వద్ద బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలను పార్టీ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  ముషీరాబాద్ డివి జన్ బీఆర్‌ఎస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్రెడ్డి, ఆకుల అరుణ్ కుమార్, వైఎస్‌ఆర్ పార్కు కాల నీ అధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, నాయకులు మంజు ల, ఉషా తదితరులు పాల్గొన్నా రు. ముషీరాబాద్ రాంనగర్‌లోని ప్రేర్ పవర్ చర్చ్‌లో బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఆర్ మోజేస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు..

జవహర్‌నగర్ పరిధిలో..                  

జవహర్‌నగర్: కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంగీత రాజశేఖర్, ఉద్యమకారుల ఫోరం జవహర్ నగర్ అధ్యక్షుడు సుధాకర్ చారి, వెంకటేష్, సింగన బాలరాజు పటేల్, పరుశురామ్, ప్రసాద్ గౌడ్, మహేష్ జక్కుల భాస్కర్ పటేల్, కాసిం పాల్గొన్నారు.

ఫిర్జాదిగూడలో పరిధిలో.. 

మేడిపల్లి: బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్ల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, మధుసూదన్ రెడ్డి, కౌడే పోచయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, యూత్ అధ్యక్షులు ప్రభు, మైనారిటీ అధ్యక్షులు జిలాని పాషా పాల్గొన్నారు. 

బడంగ్‌పేట్‌లో..

బడంగ్‌పేట్:  బాలాపూర్‌లో సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బీఆర్‌ఎస్  జెండాను ఎగురవేశారు. తిరుమలనగర్ అల్మాస్‌గూడలో  పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి జెండాను ఆవిష్కరిం చారు. కార్యక్రమాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రాజ్, నాయకులు గుండోజు రఘునందనచారి, శ్రీరామ్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, జంగారెడ్డి, ఇంటూరి గీత పాల్గొన్నారు.