ఘనంగా బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
28-04-2026 12:11 AM
రేగోడు, ఏప్రిల్ 27 : బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా మండల కేంద్ర మైన రేగోడుతో పాటు ఆయా గ్రామాల్లో బిఆర్‌ఎస్ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ జండా లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్, బిఆర్‌ఎస్ పార్టీ రేగోడు గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్ , మాజీ సర్పంచులు రవీందర్, నర్సింలు, గోపాల కృష్ణ యాదవ్ ,మాజీ ఎంపిటిసి గొల్ల నర్సింలు, నాయకులు కృష్ణ మూర్తి యాదవ్, గురునాథ్ రెడ్డి, అమృత్, వినోద్ కుమార్, నాగయ్య స్వామి, సాయిబాబా, ఈశ్వర్ గౌడ్, ఉప్పరి సాయిలు తదితరులు పాల్గొన్నారు.






