31 August, 2026 | 9:31 AM

Breaking News

భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. బోనం ఎత్తిన ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి   •   క్రీడా స్ఫూర్తితో గెలపోటములను స్వీకరించాలి: ప్రాజెక్టు అధికారి రాహుల్   •   చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి   •   ఆదివాసి యువతి శిరీష కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలి   •   యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ గొప్ప అవకాశం   •   యావాపూర్ లో ఘనంగా బోనాలు   •   అత్యంత వైభవంగా బోనాల పండుగ   •   సాంబ శర్వాణి రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి   •   ఉమ్మడి మానాలలో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి   •   కౌకూర్ మోడల్ మార్కెట్ భవనం కోసం నాలుగో రోజు ధర్నా   •  

కేసీఆర్, రేవంత్‌రెడ్డి కాంప్రమైజ్డ్ పాలిటిక్స్

23-04-2026 01:57 AM

కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): కేసీఆర్, రేవంత్ రెడ్డి కాంప్రమైజ్డ్ పాలిటిక్స్‌కు కాళేశ్వరమే తార్కాణమని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. బుధవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేస్తూ కాళేశ్వరంపై హైకోర్టులో సరైన వాదనలు వినిపించడంలో ఫెయిలయ్యారని తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తేనే అర్ధమవుతోందన్నారు. కేసీఆర్‌ను కాపాడటానికే రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నార న్నారు.

రూ.లక్ష కోట్ల కాళేశ్వరం స్కాంపై కాకుండా రూ.9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడం కూడా అందులో భాగమే అన్నారు. ఇది పథకం ప్రకారం జరిగిన పన్నాగమేనని, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు మూటలు వెళుతున్నాయి... ఇక్కడ కేసులు క్లోజ్ అవుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి క్విడ్ ప్రో కో వ్యవహారాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు.