31 August, 2026 | 10:38 AM

Breaking News

జోగులాంబ అమ్మవారి సన్నిధిలో కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు   •   నేరాల నియంత్రానికే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •  

పేదల డాక్టర్ గుండెపోటుతో హఠాన్మరణం

23-04-2026 01:59 AM

బైంసా, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): పేదలపాలిటీ ఆయన దేవుడు. శస్త్ర చికిత్సలు చేయడంలో అందవేసిన చేయి. ప్రభుత్వ వైద్యుడిగా బైంసా ప్రాంతంలో నిరంతరం వైద్య సేవలు అందించిన ఆయన మూడు సంవత్సరాల క్రితం నర్సాపూర్ జి ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు.

రెండు దశాబ్దాలుగా ఆయన అందించిన వైద్య సేవలు వెలకట్టలేనివి. ఆయనే డాక్టర్ సురేందర్. అటువంటి వైద్యుడికి బుధవారం గుండెపోటు రావడంతో వెంటనే నిర్మల్ జిల్లా కేంద్రానికి చికిత్స కోసం తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో భైంసాలో విషాద ఛాయలు అలముకున్నాయి. పట్టణ వైద్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.