కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం
మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్
రామగిరి,(విజయ క్రాంతి) కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్‌గా నూతనంగా నియమితులైన కాటం సత్యం ను మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ శాలువాతో ఘనంగా సత్కరించారు. శుక్రవారం రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో కాటం సత్యం కు తిరుపతి యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న, రామగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోషం, మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, పన్నూర్ సర్పంచ్ చిందం మహేష్, నవాబ్‌పేట సర్పంచ్ రొడ్డ మౌనిక కుమార్, రాజాపూర్ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య, లొంక కేసారం సర్పంచ్ విరాగోని రమాదేవి శ్రీనివాస్, ఆదివారం పేట సర్పంచ్ ఇల్లందుల సంజీవ్ పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచులు ఎరుకల బాపూరావు, తీగల సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ కొప్పుల గణపతి, ఐఎన్‌టియుసి నాయకులు శంకేసి రాయమల్లు, మాజీ ఉప సర్పంచ్ వేము కనకయ్య, బంక్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




