3 March, 2026 | 4:19 AM

శంకర్‌పల్లి మండలంలోని గ్రామాలలో భక్తిశ్రద్ధలతో కామ దహనాలు

03-03-2026 12:22 AM

శంకర్ పల్లి; మార్చి2.(విజయ క్రాంతి)శంకర్ పల్లి మండలంలోని గ్రామాలలో, మున్సిపల్ పరిధిలోని ప్రాంతాలలో ఆదివారం రాత్రి ప్రజలు భక్తిశ్రద్ధలతో కామ దహనాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. శంకర్ పల్లి పట్టణంలోని మహా రాష్ట్రీయులు, గుజరాత్, రాజస్థానీయులు సోమవారం రాత్రి కామ దహనాలు నిర్వహించారు. కాగా నేడు మంగళవారం ప్రజలు హోలీ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో నిర్వహించుకుంటారు.