3 March, 2026 | 6:00 AM

హాస్టల్ విద్యార్థులతో క్యాటరింగ్

03-03-2026 12:22 AM

క్యాటరింగ్‌కు రాలేదని విద్యార్థిని కొట్టిన మరో విద్యార్థి 

పాలిటెక్నిక్ హాస్టల్లో విద్యార్థి తండ్రి ఆవేదన 

గజ్వేల్ జిఎంఆర్ పాలిటెక్నిక్ హాస్టల్ లో పర్యవేక్షణ లోపం

గజ్వేల్, మార్చి 2 : హాస్టల్లోని విద్యార్థులతో కొందరు క్యాటరింగ్ నిర్వహిస్తూ విద్యా ర్థుల హక్కులను కాల రాస్తున్నారు. విద్యార్థులను చదువుకే అంకితం చేయాల్సిన అధికా రులు సిబ్బంది డబ్బుల ప్రలోభాలకు గురి చేస్తూ విద్యార్థులను క్యాటరింగ్ తదితర పనులకు పంపిస్తున్నారు.

గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ము న్సిపాలిటీలోని సంగాపూర్ లో ప్రభుత్వ జి ఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో పర్యవేక్షణ లోపం కళ్ళకు కట్టినట్లుగా కనబడు తుంది. ఆదివారం రాత్రి పాలిటెక్నిక్ కళాశా ల హాస్టల్ లో జూనియర్ విద్యార్థి పై సీనియ ర్ విద్యార్థులు దాడి చేశారు. గజ్వేల్ మం డలం బెదిగామ గ్రామానికి చెందిన బోనగిరి మనోజ్ తనను సీనియర్ విద్యార్థులు క్యాటరింగ్ చేయడానికి రమ్మంటే వెళ్లలేదని అం దుకే తనను కొట్టారంటూ తండ్రి బోనగిరి కు మార్ కు ఫోన్లో తన ఆవేదన వ్యక్తం చేశాడు.

కుమారుడు ఏడుస్తూ ఫోన్ చేయడంతో బోనగిరి కుమార్ ఉదయాన్నే పాలిటెక్నిక్ హాస్టల్ కు వెళ్లి తన కుమారుని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నాడు. అక్కడే తన కొడుకు మనోజ్ ని కొట్టిన సీనియర్ విద్యార్థులు ఉండడంతో తన కొడుకును ఎందుకు కొట్టారు అంటూ వారిపై చేయి చేసుకున్నా డు. తాము కొట్టలేదంటూ విద్యార్థులు బుకాయించడంతో గొడవకు దారి తీసింది. హా స్టల్ ప్రాంగణంలో గొడవ జరుగుతుందని తెలుసుకున్న ఇన్చార్జి ప్రిన్సిపాల్ అక్కడికి చేరుకొని విద్యార్థులను చెదరగొట్టాడు.

విలేకరులు ఈ విషయం తెలుసుకుని అక్కడికి రాగా విలేకరుల సైతం ఇన్చార్జి మున్సిపల్ బెదిరింపులకు గురి చేశారు. హాస్టల్లో గందరగోళ పరిస్థితుల మధ్య విద్యార్థులు చదు వులు చదువుతున్నారా లేక అసాంఘిక కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్నారో సరైన పర్యవేక్షణ కూడా లేకపోయింది. విధి నిర్వహణలో ఉండే ప్రిన్సిపాల్ హాస్టల్లో వస్తువుల నిర్వహణతో పాటు ఏం జరిగినా బాధ్య త వహించాల్సిన ప్రిన్సిపాల్, డిప్యూటీ వా ర్డెన్ ఆదివారం రాత్రి జరిగిన సంఘటన సమయంలో అందుబాటులో లేకపోవడం గమనార్హం.

అక్కడే ఉన్న వాచ్ మెన్ మరో విద్యార్థికి జ్వరం రావడంతో హాస్పిటల్ కు వెళ్లగా, హాస్టల్లో ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో విద్యార్థుల గొడవ జరిగినట్లు అక్కడే ఉన్న మరి కొందరు విద్యార్థులు వెల్లడించారు. అలాగే హాస్టల్ ముందు గేటు తా ళం వేసి ఉన్న వెనక్కి గేట్ ఓపెన్ ఉండడం తో ఇతర హాస్టల్ విద్యార్థుల సైతం రాత్రిపూట తమ హాస్టల్ కి వస్తుంటారని, ఆదివా రం రాత్రి కూడా ఇతర హాస్టల్ విద్యార్థుల తమ హాస్టల్ కి వచ్చి గొడవ చేసినట్లు విద్యార్థులు వెల్లడించారు. 

రేపు ప్రిన్సిపాల్ వస్తారు మాట్లాడండి - విలేకరులతో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ తీరు 

హాస్టల్ లో జరిగిన ఘటనపై పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పిట్ల స్వామిని వివరణ కోరగా ఒకసారి ఆఫీస్ కు రావాలని, మరోసారి రేపు ప్రిన్సిపాల్ వస్తారు ఆయన దగ్గరే సమాచారం తీసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం వారి విధి నిర్వహణ తీరుతెన్నులకు ఉదాహరణగా నిలుస్తుంది. విధుల్లో ఉన్న ఇన్చార్జి ప్రిన్సిపాల్, డిప్యూటీ వార్డెన్ సీనియర్ విద్యార్థులతో దెబ్బలు తిన్న విద్యార్థి మనోజ్ తో పాటు దాడి చేసిన విద్యార్థులను విచారించి విషయం తెలుసుకున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఆదివారం రాత్రి హాస్టల్ విడిచి విద్యార్థులు క్యాటరింగ్ కు వెళ్లడానికి వారికి అనుమతి ఎవరిచ్చారు అన్నది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలింది. పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రభుత్వ కళాశాలలో బాగా చదువుకుంటారని పంపిస్తే విద్యార్థులను పట్టించుకోకుండా హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకో వాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు.