calender_icon.png 19 February, 2026 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌పై కడియం శ్రీహరి విమర్శలు

19-02-2026 04:19:34 PM

  1. ఇంకెన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ తో రాజకీయాలు
  2. అధికారం పోయినా.. అహంకారం తగ్గలే

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Station Ghanpur MLA Kadiyam Srihari) తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ తెలంగాణకు ఎలా జాతిపిత అయ్యారు?, కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? జాతిపిత అయితే ప్రజాసమస్యలపై ఎందుకు స్పందించట్లేదు? అని కడియం శ్రీహరి ప్రశ్నించారు. 

కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కుటుంబంలో ప్రతి ఒక్కరూ అనేక అక్రమాలు చేసి పలు కుంభకోణాల కేసుల్లో ఇరుక్కున్నారని కడియం స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే కాళేశ్వరం కట్టి.. తెలంగాణ దివాలా తీయించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం వేలకోట్ల ఆస్తులు చెమటోడ్చి సంపాదించిందా? అని కడియం(Kadiyam Srihari) ప్రశ్నించారు. అధికారం పోయినా.. అహంకారం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీ అయ్య సొత్తా? నీ అయ్య జాగీరా? అన్నారు. ఇంకెన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్(Telangana sentiment)తో రాజకీయాలు చేస్తారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ అభివృద్ధిని(Telangana Development) అడ్డుకుంటున్నాయని  ఆరోపించారు.