calender_icon.png 19 February, 2026 | 6:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా విశ్వాసం కోల్పోతున్న ప్రభుత్వం

19-02-2026 05:06:53 PM

ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ తిరునహరి శేషు 

హనుమకొండ,(విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికలలో(municipality elections) కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ ఎన్నికల సరళని  ఓటింగ్ విధానాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రజా విశ్వాసాన్ని కోల్పోతున్నట్లుగానే కనిపిస్తుందని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరుణహరి శేషు అన్నారు.మున్సిపల్ ఎన్నికలలో మొత్తం పోలైన 37 లక్షల ఓట్లలో కాంగ్రెస్ పార్టీ 15 లక్షల ఓట్లని సాధిస్తే బిఆర్ఎస్ 11 లక్షల ఓట్లని బిజెపి ఐదు లక్షల ఓట్లను సాధించాయంటే పాలక పక్ష కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ మరియు బీజేపీలు కలిసి ఎక్కువ ఓట్లు సాధించాయి.

కాబట్టి మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారని స్పష్టం అవుతుందని అన్నారు. పంచాయతీ ఎన్నికలలో, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షాలు కూడా గట్టి పోటీ ఇచ్చాయని, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ ఇంకా బలంగా ఉండటం వలన కాంగ్రెస్ కి స్థానిక ఎన్నికలలో మెజార్టీ స్థానాలు దక్కాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో ఒక్కొక్క అభ్యర్థి సగటున 20 నుండి 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారని,అదేవిధంగా కార్పొరేషన్ డివిజన్ లలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి గెలిచారన్నారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను అతిక్రమించి ఖర్చు చేస్తున్నా ఎన్నికల కమిషన్,పోలీస్ డిపార్ట్మెంటు చోద్యం చూడటం వలన ప్రజాస్వామ్యం అపహాస్యం  పాలైందని విమర్శించారు.