19-02-2026 03:55:10 PM
లక్ష్మాపూర్ బ్రాహ్మణ బంజరు పల్లి లో శివాజీ విగ్రహాల ఏర్పాటుకు భూమి పూజ
గజ్వేల్: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 11వ వార్డులోని లక్ష్మాపూర్ బ్రాహ్మణ బంజరుపల్లి గ్రామాలలో మాజీ సర్పంచ్ కొలిచెలిని స్వామి ఆధ్వర్యంలో శివాజీ విగ్రహా(Shivaji statues) ఏర్పాటుకు 11వ వార్డు కౌన్సిలర్ కొలిచెలిమి భవాని కరుణాకర్ కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరు గ్రామాలలో ప్రజలు కోరుకున్న విధంగా శివాజీ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్వామి తెలిపారు. హిందుత్వాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు తనకు అవకాశం కలగడం ఎంతో అదృష్టమని తనకు అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయా గ్రామస్తులకు మాజీ సర్పంచ్ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.