1 June, 2026 | 1:42 PM

మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ

01-06-2026 12:26 PM

హుజూర్ నగర్, జూన్ 1: రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలకు 91 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ జీవో 574 శుక్రవారం జారీ చేసింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీ కమిషనర్ గా కె.సతీష్ కుమార్ సోమవారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన కమిషనర్ శ్రీనివాస్ నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నూతన మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ... పాలకవర్గంతో కలిసి హుజూర్ నగర్ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి,కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది,పాల్గొన్నారు.