1 June, 2026 | 1:42 PM

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

01-06-2026 12:28 PM

సర్పంచ్లు,వార్డ్ మెంబర్లకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే 

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా కృషి చేయాలి వెడ్మ బొజ్జు పటేల్..

ఉట్నూర్, జూన్ 1 ( విజయక్రాంతి ): ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కడెం  మండలంలోని సర్పంచులు, వార్డు సభ్యులు  కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం  కడెం మండలానికి చెందిన  సర్పంచ్ దికొండ విజయ్ కుమార్,ఉపసర్పంచ్ పిట్టల రాజ్ కుమార్,కన్నాపూర్ సర్పంచ్ ముల్కల్ శంకర్ మరియు వార్డ్ మెంబెర్స్ గారిని కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ పార్టీ కండువాలు వేసి  కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా  పార్టీలో చేరిన సర్పంచులు మాట్లాడుతూ  అధికార పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు మరియు నియోజకవర్గాన్ని చేస్తున్న అబివృద్దికి  ఎమ్మెల్యే చేస్తున్న కృషిని ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరుతున్నాం అని సర్పంచ్ లు అన్నారు.పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పతకాలను ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్యే పార్టీలో చేరిన సర్పంచులకు, వార్డు సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కడెం మండల అధ్యక్షుడు,  కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.