పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎంపీ డా. కడియం కావ్య
* పూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు
* మహిళల అభివృద్ధికి పూలే సేవలు చిరస్మరణీయం
* విద్యా విస్తరణకు మార్గదర్శకుడు జ్యోతిరావు పూలే
హనుమకొండ,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. పూలే 200వ జయంతి సందర్భంగా ములుగు క్రాస్ రోడ్‌లోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎంపీ డాక్టర్ కడియం కావ్య పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ జ్యోతిరావు పూలే మహిళల అభివృద్ధి కోసం విశేష కృషి చేశారని, విద్యకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలో కొత్త మార్గాలను చూపించిన మహనీయుడని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, వరంగల్, హనుమకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,చాహాత్ బాజ్ పాయి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, బీసీ సంఘం నాయకులు రమేష్ గౌడ్, చిర్ర రాజ్ గౌడ్, టిఆర్పి జిల్లా నాయకులు కొమురయ్య తదితరులు పాల్గొని మహాత్మా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల ఆదనవు కలెక్టర్లు రవి, వై వి గణేష్, సంధ్యారాణి, డిబిసిడివోలు పుష్పలత, నర్సింహ,జిల్లా అధికారులు, బిసి సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




