11 April, 2026 | 9:48 PM

Breaking News

మునుగోడులో ఘనంగా రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   13 నుంచి అరైవ్ - అలైవ్... ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యo కావాలి   •   సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు పూలే   •   మద్యం శాఖకు ఉన్న మంత్రి విద్యాశాఖకు ఎందుకు లేడు?   •   చిన్న‌చెల్మెడలో సీసీ రోడ్డు ప‌నులు ప్రారంభం   •   తిప్పారం సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం   •   నో హెల్మెట్ నో పెట్రోల్, నో సీట్ బెల్ట్ నో ఫ్యూయల్   •   సిద్దిపేటలో మత్తు పదార్థాల విముక్తి చికిత్స కేంద్రం ప్రారంభం   •   ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు   •   గ్రామాల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలి   •  

ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు

11-04-2026 07:53 PM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్

నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ తదితరులు

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిరావు పూలే ఆనాడు సమాజంలో జరుగుతున్న వివక్ష కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అణగారిన వర్గాల కోసం వారు అనేక పోరాటాలు చేశారు. జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని, ఆశయ సాధన కోసం పాటుపడాలి. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం జిల్లా కేంద్రంలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లో ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చారు.గతంలో ప్రగతిభవంలోకి మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా ప్రవేశం లేకుండా ఉండేది.

కానీ ప్రజా ప్రభుత్వంలో ప్రజాభవన్ లోకి సామాన్యలకు కూడా ప్రవేశం కల్పించడం జరిగింది ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్ద ఉంచుకొని విద్యాశాఖలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు.ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు డైట్ కాస్మోటిక్ చార్జీలను పెంచడం జరిగింది.ప్రభుత్వం రాష్ట్రంలో 20 ఎకరాల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నాం.జూన్ 2  నుండి రాష్ట్రంలో 1 కోటి 15 లక్షల మంది రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఆత్మీయ బరోసా పథకం అమలు చేస్తాం.పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది.

నేతన్నలకు ఇబ్బంది కలగకుండా గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను విడుదల చేయడం జరిగింది.నేతన్నలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఇందిరమ్మ చీరాల ఆర్డర్లను మన ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. మళ్లీ మరో రకం చిలకపచ్చ రంగు చీరలను ఆర్డర్లు కూడా ఇక్కడే ఇస్తాం.ఆనాడు జిల్లా కోసం అనేక పోరాటాలు చేశాం.జిల్లా సాధనకు ఉద్యమం చేసిన వారికి అండగ ఉంటాం.ప్రజా ప్రభుత్వంలో ఏర్పడిన వెంటనే విద్యుత్ సరఫరా, నేతన్నలకు అందించే సబ్సిడీ లపై అనేక సమావేశం ఏర్పాటు చేసాం.రైతులకు నేతన్నలకు వియోగదారులకు ఎలాంటి ఇబ్బందుల లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నేతన్న పరిశ్రమ మరింత ముందుకు పోతుంది.జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం.