మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
11-04-2026 07:45 PM
తూప్రాన్,(విజయక్రాంతి): అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిలోదరణకు కృషి సఫలూడు. 1973 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందుటకు సత్యశోధక్ సమాజం ను ఏర్పాటు చేశాడు. అణగారిన అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో మతాలకు, కులాలకు అతీతంగా కృషి చేసినటువంటి వ్యక్తి, వితంతువుల కోసం గృహాన్ని బాలికల కోసం పాఠశాలను ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే. ఈయన జయంతి సందర్భంగా తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ యాంజల స్వామి మరియు పాలకవర్గం సభ్యులతో కలిసి జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.




