30 June, 2026 | 11:54 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

జస్టిస్ యశ్వంత్‌వర్మ రాజీనామా

11-04-2026 12:00 AM

రాష్ట్రపతికి లేఖ సమర్పణ

న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: తన నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడం, తనపై అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీకి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖలు రాయడం, పార్లమెం టు ఉభయసభల్లోనూ ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని చేసిన తరుణంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్‌వర్మ శుక్రవారం రాజీనామా చేశారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. గతంలో ఢిల్లీలోని తన నివాసంలో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్రక్రియకు ప్రయ త్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. ఆయన రాజీనామా చేయడంతో అభిశంసన ప్రక్రియ ముగిసిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.