రాహుల్ గాంధీకి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన జుక్కల్ ఎమ్మెల్యే
04-08-2026 12:58 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలోని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి తన కుమార్తె వివాహ మహోత్సవానికి ఆహ్వానిస్తూ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఆహ్వానించగా, రాహుల్ గాంధీ ఆహ్వానాన్ని సాదరంగా స్వీకరించారు. నూతన దంపతులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ఆనందం, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో కళకళలాడాలని ఆకాంక్షించారు.






