23 August, 2026 | 2:31 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

23-08-2026 12:51 AM

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)లోకి వరుస చేరికలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్పీ లో చేరారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చా ర్జి బంధారపు నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం సాధన కోసం టీఆర్పీ నిరంతరం పోరాడుతుందన్నారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసమ స్యలపై చేస్తున్న పోరాటాలను విశ్వసించి నాయకులు, యువత పార్టీలో చేరడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జనార్ధన్ ముదిరాజ్, చేవెళ్ల మండల అధ్యక్షులు అశోక్ కూనుకుర్తి, షాబాద్ మండల అధ్యక్షులు కావలి శంకర్, భువనగిరి భాను తేజ, ఆసిఫ్ హుస్సేన్, బేకరి రామచంద్రయ్య, చందోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.