9 August, 2026 | 1:20 AM

హెచ్1-బీ వీసాదారుల గ్రేస్ పీరియడ్ ఎత్తివేత?

09-08-2026 12:33 AM

వైట్‌హౌస్‌కు అమెరికా హోంల్యాండ్ విభాగం నివేదిక

వాషింగ్టన్, ఆగస్టు 8: హెచ్1-బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోయిన తర్వాత కూడా అమెరికాలో ఉండేందుకు అనుమతించే 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను ట్రంప్ సర్కారు ఎత్తివేయనుంది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనను హోంల్యాండ్ సెక్యూరిటీ వి భాగం వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్‌కు పంపగా అది  సమీక్షిస్తోంది.  ఒకవేళ ఈ విధానం అమల్లోకి వస్తే.. ఉద్యో గం కోల్పోయిన వీసాదారులు తక్షణమే అమెరికాను వీడాల్సి ఉంటుంది.

వీసా నిబంధనల్లో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తుం డగా, కొత్త వీసాలపై లక్ష డాలర్ల రుసుం విధించారు. లేఆఫ్‌లు, ఇతర కారణాల వల్ల హెచ్1-బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే, కొత్త ఉద్యోగాన్ని వెతుక్కునేందుకు ప్రస్తుతం 60 రోజుల గ్రేస్ పీరియడ్‌గా కొనసాగుతుం ది. ఈ విధానాన్నే ట్రంప్ సర్కార్ రద్దు చేసి వలసలపై ఉక్కుపాదం మోపాలని యోచిస్తోన్నట్లు తెలుస్తుంది.

కాగా ట్రంప్ తెరమీదకు తీసుకువస్తున్న ఈ ప్రతిపాదన అమెరికాలో మరింత కార్మికులలోటుకు కారణమైన, వృ ద్ధి మందగమనం వైపు దారితీసే పరిస్థితులు ఉన్నాయని, ఆర్థికం, ద్రవ్యోల్బణం తదితర వాటిపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు పారిశ్రామికవేత్తలు, న్యాయ నిపుణులు, ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.