31 August, 2026 | 10:51 PM

ఒకే రోజు 16 కొత్త శాఖలని ప్రారంభించిన కరూర్ వైశ్యా బ్యాంక్

31-08-2026 09:55 PM

హైదరాబాద్, ఆగస్ట్ 31, 2026: భారతదేశపు ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన కరూర్ వైశ్య బ్యాంక్ (కెవిబి), కొత్తగా 16 శాఖలు ప్రారంభించడం ద్వారా కీలక మార్కెట్లలో విస్తరించి, దక్షిణ భారతదేశం, ఢిల్లీ ఎన్‪సిఆర్ వ్యాప్తంగా తన ఉనికి మరింత బలోపేతం చేసుకుంది. ఈ తాజా విస్తరణతో, ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంక్ శాఖల నెట్వర్క్ 919కి చేరింది. ఈ కొత్త శాఖల్లో ఆరు తమిళనాడులోను, ఐదు ఆంధ్రప్రదేశ్ లోను, మూడు తెలంగాణలోను, కర్నాటక, ఢిల్లీ ఎన్‪సిఆర్ ల్లో ఒక్కోటి ప్రారంభమయ్యాయి.

బ్యాంక్ విస్తరణ ప్రయాణంలో గణనీయమైన మైలురాయిని సాధిస్తూ, వివిధ ప్రదేశాల్లో కెవిబి ఒకే రోజు పలు శాఖల్ని ప్రారంభించింది. కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ, శ్రీ రమేష్ బాబు, హైదరాబాద్ లోని కొత్త గచ్చిబౌలి శాఖని ప్రారంభించి, మిగిలిన శాఖల్ని విడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించడం ద్వారా ఈ విస్తరణ మైలురాయికి సారథ్యం వహించారు.

తెలంగాణలో, ఇతర రెండు కొత్త శాఖలని స్థానిక ప్రముఖులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షంగా ప్రారంభించారు. హైదరాబాద్ - కోకాపేట శాఖ ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (బంజారా హిల్స్) అధ్యక్షులు, డా. ప్రభు కుమార్ చల్లగాలి, ముఖ్య అతిథిగా హాజరై, మెడికవర్ హాస్పిటల్స్ లో సీనియర్ కన్సల్టెంట్ అయిన డా. పేరుం పృథ్వితో కలిసి సాంప్రదాయిక గాయత్రి దీపం వెలిగించి ప్రారంభించారు. ఇంద్రేషం శాఖని ఇంద్రేషం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్, శ్రీ ఎస్. అజయ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మెడిస్టార్ హాస్పిటల్స్ కు చెందిన డాక్టర్. లతా పోతుగంటితో కలిసి గాయత్రీ దీపం వెలిగించి ప్రారంభించారు.

తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ మూడు శాఖలు, ప్రధాన ప్రాంతాల్లో, అత్యంత సులువుగా చేరుకోగలిగే ప్రాంతాల్లో ఉన్నాయి. గచ్చిబౌలి శాఖ జయభేరీ ఎన్‪క్లేవ్ లో వుండగా, కోకాపేట శాఖ గోల్డెన్ మైల్ లేఅవుట్ లో వుంది, ఇంద్రేషం శాఖ సంగారెడ్డి జిల్లా మెడిస్టార్ హాస్పిటల్స్ దగ్గర మెయిన్ రోడ్డు మీదే వుంది.

రమేష్ బాబు, మేనేజింగ్ డైరెక్టర్ & సిఇఒ, కరూర్ వైశ్యా బ్యాంక్, ఈ సందర్భంగా మాట్లాడుతూ, "మంచి వ్యాపార అవకాశాలు, వినియోగదారులతో మా సంబంధాలు మరింత బలోపేతం చేసుకునే అవకాశాలు వున్నాయని అనుకున్న ప్రాంతాలలో మేము మా శాఖల నెట్వర్క్ ను విస్తరిస్తూనే ఉన్నాం. డిజిటల్ బ్యాంకింగ్ వల్ల రోజువారీ లావాదేవీలు ఎంతో సులభతరం అయినప్పటికీ, ముఖ్యంగా ఎంఎస్ఎంఇ, రిటైల్, వ్యవసాయ రంగాలకు చెందిన వినియోగదారుల విషయంలో బ్యాంక్ శాఖలు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు, అలాగే వారికి వ్యక్తిగతీకరించిన, డిజిటల్ బ్యాంకింగ్ సేవలు రెండింటినీ అందించే సౌలభ్యాన్ని కల్పించేందుకు ఈ కొత్త శాఖలు మాకు సహాయపడతాయి" అన్నారు.బ్యాంక్ వ్యాపారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతి నేపథ్యంలోనే ఈ విస్తరణ జరిగింది.