2 April, 2026 | 4:43 AM

నేటి నుంచి జేఈఈ మెయిన్స్

02-04-2026 01:10 AM

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ప్రతిష్ఠాత్మకమైన ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్ సెషన్ 2 పరీక్షలు నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 2,4,5,6,8 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. తెలంగాణ నుంచి సుమారు 80 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది.

రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లలో పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. హాల్‌టికెట్‌పై ఉన్న నియమ నిబంధనలు విద్యార్థులు పాటించాలని ఎన్టీఏ సూచించింది. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధనను పాటించనున్నారు.