13 August, 2026 | 1:33 AM

త్వరలోనే జంతర్ మంతర్ 2

13-08-2026 12:40 AM

రెండో దశ నిరసనలు ఉంటాయన్న అభిజీత్ దీప్కే  

న్యూఢిల్లీ, ఆగస్టు 12: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో త్వరలోనే జంతర్ మంతర్ 2 ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తెలిపారు. ఢిల్లీలో బుధవారం జరగాల్సిన పార్టీ వలంటీర్ల సమావేశం చివరి నిమిషంలో రద్దు కావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఒత్తిళ్ల కారణంగానే భ వనం యజమాని హాల్ బుకింగ్‌ను రద్దు చే శారని దీప్కే ఆరోపించారు. సమావేశం నిర్వహణకు అనేక ప్రాంతాల్లో హాల్ కోసం ప్ర యత్నించినా ఎక్కడా లభించలేదన్నారు.

ఒక వేదిక ఖరారైనప్పటికీ, సమావేశానికి కొద్దిసేపటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు భ వన యజమానిని బెదిరించడంతో అతను కూడా నిరాకరించారని పేర్కొన్నారు. దీనిపై తమకు సమాచారం అందిందన్నారు. యు వతను చూసి బీజేపీ భయపడుతుందన్నా రు. ‘జంతర్ మంతర్ సీజన్-2 ఎప్పుడు ప్రా రంభమవుతుంది?’ అని  చాలా మంది ప్రశ్నిస్తున్నారని, త్వరలోనే రెండో దశ నిరసనలు ఉంటాయని దీప్కే స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురైనా తాము వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు.