13 August, 2026 | 2:46 AM

కేటీఆర్ చేతుల మీదుగ ఉచిత కళ్లద్దాల పంపిణీ

13-08-2026 01:33 AM

వీర్నపల్లి,ఆగస్టు 12(విజయక్రాంతి): వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం నిర్వ హించిన ఉచిత కళ్లద్దాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా కంటి పరీక్షలు నిర్వహించి దృ ష్టి లోపాలు ఉన్న 1,340 మంది ప్రజలకు ఉచితంగా కళ్లద్దాలను కేటీఆర్ పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు కంటి వైద్య సేవలు, కళ్లద్దాలు ఉచితంగా అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.