13 August, 2026 | 1:58 AM

తెరపైకి ‘ఆజాద్ హింద్ ఫౌజ్’

13-08-2026 12:43 AM

నేతాజీ మునిమనవడు చంద్రకుమార్ బోస్ కొత్తపార్టీ

కోల్‌కతా, ఆగస్టు 12: జంతర్‌మంతర్ వ ద్ద జరిగిన జెన్ జీ యువత నిరసనలు తనకు స్ఫూర్తినిచ్చాయని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవడు చంద్రకుమార్ బోస్ అన్నారు. యువతలో పెరుగుతున్న అసంతృప్తిని తరిమికొట్టేందుకు రాజకీయ ప్రత్యా మ్నాయం అవసరం ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రగతిశీల, సమగ్ర, లౌకిక భావజాలం ఉన్న యువతను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. ‘ఆజాద్ హింద్ పార్టీ’ పేరుతో సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు బుధవారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తన రాజకీయ ప్రయాణాన్ని బోస్ ముగించారు. దేశంలో అవినీతి విస్తృతంగా పెరిగి పోయిందని ఆరోపించారు.

విద్య, వైద్యం, మౌలిక సదుపాయా లు, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లోనూ అవినీతి వ్యవస్థలో భాగమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, పాలనా వ్యవస్థలపై యువతలో అసంతృప్తి పెరుగుతోందని పేర్కొన్నారు. కాగా సొంత పార్టీ ఏ ర్పాటు చేసి, బలమైన కేడర్, నాయకత్వం, ఆర్థిక వనరులు, విధివిధానాలు, ఎన్నికల్లో పోటీ చేసే సామర్థ్యం వంటివి చంద్రకుమార్ బోస్ ఏర్పాటు చేయగలడా? అనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.