27 February, 2026 | 3:54 AM

పట్టుబిగించిన జమ్మూకశ్మీర్

27-02-2026 12:00 AM

రంజీ ట్రోఫీ ఫైనల్

హుబ్లీ, ఫిబ్రవరి 26: రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో జమ్మూకశ్మీర్ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ రాణించి కర్ణాటకు దెబ్బకొట్టింది. ఫలితంగా తొలిసారి రంజీ టైటిల్ సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. జమ్మూకశ్మీర్ 584 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జమ్మూ బ్యాటర్లలో దా దాపు ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేశారు. శుభమ్ పుందిర్ 121 పరుగు లతో టాప్ స్కోరర్గా నిలవగా.. యావర్ హసన్(88), పారస్ డోగ్రా(70), కన్హయ్య వధావన్(70 పరుగులు) రాణించారు.

తర్వాత బౌలింగ్‌లో సైతం ఆధిపత్యం కనబరిచింది. కర్ణాటక కీలక బ్యాటర్లను త్వరగానే పెవిలియన్‌కు పంపింది. అయితే మయాంక్ అగర్వాల్ అజేయ సెంచరీ(130 బ్యాటింగ్)తో పోరాడుతున్నాడు. కర్ణాటక జట్టులో కీలక బ్యాటర్లంతా నిరాశపరిచారు. కెప్టెన్ దేవ్దత్త్ పడిక్కల్ 11 పరుగులు చేయగా.. సీనియర్ బ్యాటర్లు స్మరన్ రవిచంద్రన్, కరుణ్ నాయర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్

చేరారు.  జమ్మూ కాశ్మీర్ బౌలర్లలో అకి బ్ నబీ మూడు వికెట్లు పడగొట్టగా.. యుద్ద్వీర్ సింగ్, సునీల్ కుమార్ తలా వికెట్ సాధించా రు. ప్రస్తుతం క్రీజులో అగర్వాల్‌తో పాటు కృతిక్ కృష్ణ(27) ఉన్నారు. కర్ణాటక ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో జమ్మూ కంటే 364 పరుగుల వెనకంజలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే మొదటి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు సాధిస్తుందో వారికే టైటిల్ దక్కుతుంది.