18 April, 2026 | 6:11 AM

జెట్లీ వచ్చేది ఆ రోజే

18-04-2026 12:00 AM

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేశ్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ)  హేమలత పెద్దామల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, అజయ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటికే ఫస్ట్-లుక్ పోస్టర్లు, ఫన్ గ్లింప్స్, ‘సత్య ఈజ్ నాట్ జెట్లీ’ ప్రమోషనల్ సాంగ్‌తో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక మేకర్స్ శుక్ర వారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో సత్య, వెన్నెల కిశోర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో డైనమిక్‌గా నడిచివస్తూ ఆకట్టుకుంటున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సురేశ్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్, నార్ణి శ్రీనివాస్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు.