17 August, 2026 | 4:28 AM

జై శ్రీరామ్ వాకర్స్ అసోసియేషన్ రక్తదాన శిబిరం

17-08-2026 12:46 AM

సిద్దిపేట, ఆగస్టు 16 (విజయక్రాంతి): సిద్దిపేట జైశ్రీరామ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 65 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాహకులు సేకరించారు. ప్రత్యేక వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని పేర్కొన్నారు.

ఎంతోమందికి రక్తం అవసరమయ్యే పరిస్థితులు ఉన్నాయని అందులో ఎంతోకొంత తమ వంతు సహకారాన్ని అందిదించేందుకు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నెబోయిన మల్లేశం, ఉపాధ్యక్షుడు యాద రాజు, ప్రధాన కార్యదర్శి తోట్ల మురళి కోశాధికారి మల్లకొల్ల మల్లేశం, సహాయ కార్యదర్శి తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ బుస చంద్రశేఖర్, ఈ సి నెంబర్ పిట్ల శ్రీనివాస్ సభ్యులు పాల్గొన్నారు.