27 February, 2026 | 11:19 AM

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి

27-02-2026 01:01 AM

సంగారెడ్డి, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు, జెట్టి కుసుమ కుమార్కు ఇవ్వాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిసి కోరినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. ఈ విషయంలో రాహుల్ గాంధీనీ, మల్లికార్జున్ ఖర్గేనీ కలవడానికి ఢిల్లీ వెళ్ళినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ముందస్తు షెడ్యూల్ కారణంగా బిజీగా ఉండడంతో మల్లిఖార్జున ఖర్గేను కలిసిన ట్లు చెప్పారు.

అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్ మహేశ్ కుమార్గౌడ్, రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్తో కూడా మాట్లాడినట్లు తెలిపారు. జెట్టి కుసుమ కుమార్ యూత్ కాంగ్రెస్ నాయకుడని, కమ్మ సామాజిక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అవకాశం ఇ వ్వాలని కోరినట్లు తెలిపారు. సీనియర్ నాయకుడు హనుమంతరావు తెలంగాణలో అనేక ము ఖ్యమంత్రులతో పని చేశారని, మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా పని చేశారని గుర్తు చేసినట్లు చెప్పారు. తన ప్రతిపాదన మేరకు కమిటీలో చర్చిస్తామని మల్లిఖార్జున ఖర్గే హామీనిచ్చినట్లు చెప్పారు.