రైతులకు నిరంతరాయంగా విద్యుత్తును అందించాలని నిరసన
మెయిన్ రోడ్డుపై ఘనంగా జగదీశ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
తుంగతుర్తి,(విజయక్రాంతి): మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను తుంగతుర్తి మండల బీఆర్‌ఎస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు అనంతరం బిఆర్ఎస్ నాయకులు ర్యాలీతో వెళ్లి ట్రాన్స్కో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు. జగదీశ్ రెడ్డి దీర్ఘాయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి జగదీశ్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.






