18 July, 2026 | 9:47 PM

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

18-07-2026 08:51 PM

డిఎంహెచ్వో మధుసూదన్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ 

గణపురం,(విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ అన్నారు. శనివారం ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయోగశాల, టీకాల గది, ఔషధ నిల్వ విభాగాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గణపురం-1 ఉప కేంద్రాన్ని సందర్శించి, అన్ని రకాల టీకాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అల్లూరి అనుషా  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.