22 May, 2026 | 10:26 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జాడి రాంబాబు

04-12-2025 10:39 PM

గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడమే తన లక్ష్యం..

బుట్టాయిగూడెం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాడి రాంబాబు..

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా తాను సర్పంచ్ బరిలో ఉంటున్నానని కాంగ్రెస్ పార్టీ నుంచి బుట్టాయిగూడెం సర్పంచ్ అభ్యర్థి జాడి రాంబాబు తెలిపారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన జాడి రాంబాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, పెద్ద ఎత్తున మహిళలతో మేళ తాళాలతో తరలివచ్చారు.

బుట్టాయిగూడెం గ్రామంలో ఉన్న శ్రీ సమ్మక్క-సారలమ్మను దర్శించుకుని బుట్టాయిగూడెం నుంచి ముప్పనపల్లి గ్రామంలో నామినేషన్ కేంద్రం వరకు భాజా భజంత్రీలతో జై కాంగ్రెస్ నినాదాలు ఇస్తూ వెళ్లారు. ఈ సందర్భంగా బుట్టాయిగూడెం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి జాడి రాంబాబు మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడమే తన లక్ష్యంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.