మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు
100 డయల్‌కు స్పందించిన పోలీసులు.
ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పోలంపల్లి గ్రామానికి చెందిన గూగులోత్ విజయ భర్త పేరు కిషన్ అనే మహిళ తన రోజువారీ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మార్గమధ్యలో కారులో కూర్చొని మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన చోటుచేసుకుంది. భాగ్యనగర్ తండాకు చెందిన నెట్ షాప్ నిర్వాహకుడు వాంకుడోత్ బన్సీలాల్, ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన మెకానిక్ పచ్చిపాల వెంకట్‌లు నకిలీ విలేకరుల ముసుగులో చలామణి అవుతూ వారితోపాటు ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన మరో ఇద్దరు వ్యక్తులు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని మహిళ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో బాధితురాలు వెంటనే 100 డయల్‌కు ఫోన్ చేయగ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, వారు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






