22 May, 2026 | 11:35 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం..

04-12-2025 10:45 PM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..

పంచాయతీ ఎన్నికలపై ఎన్నికల కమీషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క ఎన్నికల సిబ్బందికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఐ. రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎన్నికల సాధారణ పరిశీలకూలు సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకులు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, జడ్ పి సిఈ ఓ నాగలక్ష్మితో కలిసి పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాల ప్రకటన నియమాలు, ఏకగ్రీవ స్థానాలలో ఉప సర్పంచ్ ఎన్నిక, పోస్టల్ బ్యాలెట్ ఏర్పాటు, నామినేషన్ల పై వచ్చే ఫిర్యాదులు,  తదితర అంశాల పట్ల ఎన్నికల కమిషనర్ రివ్యూ నిర్వహించి వార్డు సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నికైన చోట ఉప సర్పంచ్ ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని, ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ పోస్టులకు సంబంధించి ఫలితాలు నిబంధనల ప్రకారం ప్రకటించాలని అన్నారు.

అనంతరం అధికారులతో  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ వచ్చిన ప్రతి దరఖాస్తు పరిశీలించి తప్పని సరిగా అర్హులకు పోస్టల్ బ్యాలెట్ అందించాలని, ప్రతి గ్రామం, మండలాల వారీగా వివరాలు సేకరించి సంబంధిత రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్ జారీ చేసేలా చూడాలని అన్నారు. మొదటి విడత పోలింగ్ జరిగే గ్రామాల్లో ఓటు హక్కు ఉండి ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బంది డిసెంబర్ 8 నాడు, రెండవ విడత వారికి 12 నాడు, మూడవ విడత వారికి 15 నాడు ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ , సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల వద్ద  మైక్రో అబ్జర్వర్ నియామకం చేయాలని కలెక్టర్ సూచించారు.  ఈ సమావేశంలో ఇంచార్జి డి పి ఓ సుధీర్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.