22 May, 2026 | 9:30 PM

Breaking News

సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •  

గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభావం

04-12-2025 10:32 PM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు

వేములవాడ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, బాలరాజ్‌పల్లి గ్రామాలకు చెందిన పలువురు నేతలు గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం అందరూ సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.