22 May, 2026 | 10:12 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు

22-05-2026 09:00 PM

 కిరాణా, పాన్ షాప్ ప్రాంతాలలో నార్కోటిక్ జాగిలంతో తనిఖీ 

మత్తు పదార్థాల విక్రయాలు రవాణాపై కఠిన చర్యలు తప్పవు: ఎస్ఐ రమేష్

చందుర్తి,(విజయక్రాంతి): చందుర్తి మండలంలోని పలు గ్రామాలలో కిరాణా, పాన్ షాప్,బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు పోలీసు అధికారులు నార్కోటిక్ డాగ్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.

జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల సహకారంతోనే మత్తు పదార్థాల నిర్మూలన, భద్రతా చర్యలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని చందుర్తి ఎస్సై రమేష్ పేర్కొన్నారు.